తెలంగాణ
Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ మాట్లాడితే నీతులు.. ఎదుటి వాళ్ళు మాట్లాడితే భూతులా?

Chamala Kiran Kumar Reddy: మాజీ మంత్రి హరీష్‌రావుకు ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడితే నీతులు ఎదుటి వాళ్ళు మాట్లాడితే భూతులా?’ అని ఎంపీ చామల కిరణ్ ప్రశ్నించారు. దేశంలో బూతు పురాణానికి పేటెంట్ హక్కు అంటూ ఉంటే అది కేసీఆర్‌కే ఉందన్నారు.
గత పది సంవత్సరాలలో ఒక సీఎం హోదాలో ఉండి కేసీఆర్ ఎన్నో బూతు మాటలు, తిట్లు తిడుతూ ఒక బూతు పుస్తకమే రాసి ఉండొచ్చని అన్నారు. అలాంటి మీరు ఇవాళ నీతులు చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదన్నారు. హరీష్‌రావు తరచూ సవాళ్లు చేయడం ఆపేయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు.