ఆంధ్ర ప్రదేశ్
Botsa: గత ప్రభుత్వాన్ని దూషించడమే తండ్రి కొడుకుల పనిగా మారింది

Botsa Satyanarayana: సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాన్ని దూషించడమే తండ్రి కొడుకుల పనిగా మారిందని విమర్శించారు. మూడు సంవత్సరాల నుంచి ఇటువంటి భాష సంస్కృతిని చూడలేదన్నారు.
సూపర్ సిక్స్‌ను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. బడ్జెట్ వల్ల ఏ రంగానికి ఎటువంటి ప్రయోజనం లేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.