తెలంగాణ
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన

Hyderabad: హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేసీఆర్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీంతో ఆర్టీసీ క్రాడ్ రోడ్‌లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వాటిని తొలగించారు. దీంతో గులాబీ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.