GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస

GHMC Council Meeting: హైదరాబాద్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మరోసారి వాయిదా పడింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలు చేశారు. దీంతో… బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. సభను అడ్డుకుంటున్నారనే సస్పెండ్ చేసినట్లు మేయర్ తెలిపారు.
సమావేశం నుంచి బయటకు పంపించడంపై బీఆర్ఎస్ నేతలు జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, మేయర్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో… బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ సభ్యుల అరెస్ట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ప్రభుత్వ వైఖరిని నిలదీస్తే అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రజల తరపున ప్రశ్నిస్తే గెంటేస్తారా?అని నిలదీశారు. గత ఏడాది బడ్జెట్ నిధులను కనీసం ఖర్చు చేయలేదని అన్నారు. కార్పొరేటర్లను వెంటనే విడుదల చేయాలని ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.