తెలంగాణ
Hyderabad: యువకుడు మిస్సింగ్.. రెండు రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో అజయ్ అనే యువకుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెండు బృందాలతో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. నిన్న అర్థరాత్రి హుస్సేన్‌సాగర్‌లో రెండు బోట్లలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. టపాసులు కాలుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. అటు హుస్సేన్‌సాగర్‌లో ఉన్న రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. నిన్న అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఒక బోటులో ఫ్రెండ్స్‌తో వచ్చిన అజయ్ అనే యువకుడు మిస్ అయ్యాడు.