War 2: స్పెషల్ ప్రీమియర్స్‌తో ‘వార్-2′ రచ్చ!

War 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ‘వార్-2’ సినిమాతో సంచలనం సృష్టిస్తోంది. హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌ను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ స్పెషల్ ప్రీమియర్స్‌తో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనుంది.
‘వార్-2’ చిత్రం ఎన్టీఆర్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్, కియారా అద్వానీ నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీగా విడుదల చేయనుంది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం నిర్మాత నాగవంశీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతి కోరనున్నారు. గతంలో ‘దేవర’కు ఇలాంటి ప్రీమియర్స్ హిట్ అయిన నేపథ్యంలో ఈ వ్యూహం పనిచేస్తుందని భావిస్తున్నారు. ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించనుంది.