తెలంగాణ

Nirmal: పేకాట ఆడే విషయంలో చెలరేగిన వివాదం.. బీర్ సీసాతో దాడి

Nirmal: నిర్మల్ జిల్లా వానల్‌పాడ్‌లో ముత్యంపై ఓ వ్యక్తి బీర్ సీసాతో దాడి చేశాడు. పేకాట ఆడే విషయంలో వారి మధ్య వివాదం చెలరేగింది. అప్పటికే ఇద్దరు మద్యం మత్తులో ఉండడంతో.. వివాదం దాడి చేసే వరకు వెళ్లింది.

ఈ క్రమంలో ముత్యంపై మరో వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలైన ముత్యంను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button