ఆంధ్ర ప్రదేశ్
ఉద్యోగులపై లాఠీఛార్జ్.. జగన్ తీవ్ర ఆగ్రహం

అమరావతిలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై లాఠీఛార్జ్ చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులపై లాఠీఛార్జ్ చేయడం అమానుషమని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు. మహిళా ఉద్యోగులపై కూడా లాఠీఛార్జ్ చేశారన్నారు. ధర్నాకు వెళ్తున్న ఉద్యోగులను అడ్డుకుని నిర్బంధించడాన్ని జగన్ ప్రశ్నించారు.
ఉద్యోగుల సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని, లాఠీఛార్జ్ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కోరుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులకు న్యాయం చేస్తామని జగన్ తెలిపారు.



