తెలంగాణ
సికింద్రాబాద్ రాణిగంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్ రాణిగంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని నివారణ పరికరాలు నిల్వ ఉన్న గోదాంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంపై సమాచరాం అందుకున్న ఫైర్ సిబ్బంది.. అక్కడికి చేరుకుని మంటలను అందుపు చేశాయి. మంటల ధాటికి గోదాంలోని పరికరాలు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.



