ఆంధ్ర ప్రదేశ్
Tirumala: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ఎరుక చెప్పిన చిన్నారి

Tirumala: సోదెమ్మ సోదో అంటూ అంటూ ఓ చిన్నారి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ఎరుక చెప్పారు. ఒడిలో బుట్ట పెట్టుకుని, చేతిలో మంత్రకర్ర పట్టుకుని తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఓ చిన్నారి ఆసక్తికరంగా కనిపించింది. ఎరుకల వేషం వేసిన ఓ చిన్నారి వద్దకు వెళ్లిన ప్రశాంతమ్మ ఆ పాపతో ఎరుక చెప్పించుకున్నారు. ముద్దులొలికే ఆ పాప పలుకులకు, వేషధారణకు ప్రశాంతమ్మ మంత్రముగ్ధులయ్యారు. పాప మాట్లాడుతుండగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అంతే ఆసక్తితో ముచ్చటించారు.



