క్రీడలు
PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు

PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు శ్రీవారిని దర్శించుకున్నారు. తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మలేషియా, ఇండియా, ఇండోనేషియా టోర్నమెంట్లు జరగనున్న నేపథ్యంలో, వాటిలో విజయం సాధించేలా ఆశీర్వదించాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. అలాగే విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న తన బ్యాడ్మింటన్ అకాడమీ ద్వారా వేలాది మంది పిల్లలకు శిక్షణ అందించే అవకాశం కల్పించేలా దీవించాలని ప్రార్థించినట్లు పీవీ సింధు తెలిపారు.



