జాతియం
వీధికుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఢిల్లీలో వీధికుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాలను సవరించింది. వీధికుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దని ఆదేశించింది. కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది.



