ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila: చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదు..అన్నదాత దుఃఖీభవ

YS Sharmila: సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదు అన్నదాత దుఃఖీభవ అన్నారు. సూపర్ సిక్స్ హామీల అర్హులు అందరికి కాదు కొందరికే అన్నారు. రాష్ట్రంలో 76. 07 లక్షల మంది రైతులుంటే కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది కేవలం 47 లక్షల మంది రైతులనే అన్నారు.
బిడ్డలకు కోత పెట్టి ఇప్పుడు సుఖీభవ పేరుతో సగం మంది రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో పెద్ద పెద్ద మాటలు చెప్పారని కేంద్ర పథకానికి రాష్ట్రానికి ఏం సంబంధం అని మాటల తూటాలు పేల్చారని ఘాటు ట్వీట్ చేశారు.