ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి భారీ విరాళం

Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి బంగారు శంఖం, చక్రాలను చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ విరాళంగా సమర్పించారు. ఉదయం బ్రేక్ దర్శన సంస్థకు చెందిన వాళ్లు ఆలయంలోకి వెళ్లిన ధ్వజస్తంభానికి మొక్కుకుని బంగారు శంఖం, చక్రం విరాళంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందించారు.
అనంతరం దాత కుటుంబాన్ని అదనపు ఈవో స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం ఆలయ మర్యాదల ప్రకారం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 2.5 కేజీల బరువుగల బంగారు శంఖం, చక్రం అందించినట్లు తెలిపారు.