తెలంగాణ
Karimnagar : కరీంనగర్ లో వరద బీభత్సం .. లోతట్టు ప్రాంతాలు జలమయం

కరీంనగర్‌లో వరద బీభత్సం సృష్టించింది. నగరంలో 2గంటల పాటు భారీ వర్షం కురిసింది.మనకమ్మ తోట, రాంనగర్ ప్రాంతాల్లో భారీ వర్షంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షంతో జనజీవనం అతలాకుతలం అవుతుంది.