జాతియం

Nitish Kumar: ఎన్నికల్లో పవర్‌ ప్లే.. ఉచితం అంటూ నితీశ్‌ బంపరాఫర్‌

Nitish Kumar: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం.. ప్రజలకు వరాలను ప్రకటిస్తున్నాయి. బీహార్‌లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి నితిశ్‌ కుమార్‌ భారీ ప్లాన్‌తో హామీలు ఇస్తున్నారు. తాజాగా ప్రజలకు బంపరాఫర్‌ ఇచ్చారు. బీహార్‌లో 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులు వస్తే డబ్బులు చెల్లించాల్సి అవసరం లేదని ఆఫర్‌ ప్రకటించారు. వచ్చే నెల నుంచే ఇది అమలులోకి వస్తుందని నితిశ్‌ చెప్పుకొచ్చారు.

బిహార్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకుని అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం నీతీశ్ కుమార్‌ సర్కారు వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే మహిళలకు రిజర్వేషన్లు, ఉద్యోగాలపై ప్రకటన చేసిన ముఖ్యమంత్రి తాజాగా మరో పథకాన్ని ప్రకటించారు. 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులను చెల్లించనక్కర్లేదని వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్ చేశారు.

‘‘మేం అధికారంలోకి వచ్చినప్పటినుంచి అందుబాటు ధరల్లోనే విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నాం. గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే, జులై బిల్లులను కూడా కట్టనక్కర్లేదు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది’’ అని సీఎం నీతీశ్ కుమార్‌ వెల్లడించారు.

‘‘రానున్న మూడేళ్లలో గృహ వినియోగదారులందరి మద్దతుతో ప్రతి ఇంటిపై సోలార్‌ పవర్‌ ప్లాంట్లను అమర్చాలని నిర్ణయించాం. కుటీర్‌ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు సోలార్‌ ప్లాంట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. మిగతా వారికి అందుబాటు ధరల్లోనే వీటిని అందజేస్తాం. రాష్ట్రంలో 10వేల మెగావాట్ల సోలార్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ముఖ్యమంత్రి రాసుకొచ్చారు.

కాగా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని నీతీశ్ ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బిహార్‌లో శాశ్వత నివాసితులుగా ఉన్న మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా ప్రతి విభాగంలోని అన్ని పోస్టులకు ఆ ప్రత్యేక రిజర్వేషన్‌ వర్తిస్తుందని సీఎం చెప్పారు. ఇక, వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బిహార్‌లో ఈ ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ మధ్య ఎన్నికలు జరిగే అవకాశముంది.

సీఎం నితీశ్‌ కుమార్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా మరో పథకాన్ని ప్రకటించారు. ట్విట్టర్‌లో నితిశ్‌..‘బీహార్‌ ప్రజల అవసరాల కోసం మేం మరో పథకాన్ని తీసుకువస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంట్‌ చార్జీలు అందుబాటు ధరల్లోనే ఇస్తున్నాం. దీనిపై ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నాం. గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు కరెంట్‌ వాడుకుంటే వారు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

అంటే, జూలై బిల్లులను కూడా కట్టనక్కర్లేదు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రానున్న మూడేళ్లలో గృహ వినియోగదారులందరి మద్దతుతో ప్రతి ఇంటిపై సోలార్‌ పవర్‌ ప్లాంట్లను అమర్చాలని నిర్ణయించాం. బీహార్‌లో 10వేల మెగావాట్ల సోలార్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాంకుటీర్‌ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు సోలార్‌ ప్లాంట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.

మిగతా వారికి అందుబాటు ధరల్లోనే వీటిని అందజేస్తాం’ అని వెల్లడించారు. దీంతో, ఈ పథకంపై బీహార్‌ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ పథకం ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా బీహార్‌ మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారం కోసం అన్ని పార్టీ ప్రజలకు కీలక హామీలు ఇస్తున్నాయి. ఇక, తాము మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని నీతీశ్ ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button