జాతియం
రాజ్యసభలో ఖర్గే వర్సెస్ నడ్డా

పహల్గామ్ ఉగ్రదాడి ముమ్మాటికి ప్రభుత్వ నిఘా వైఫల్యమేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. టెర్రర్ అటాక్, ఆపరేషన్ సింధూర్‌పై చర్చించాలని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. రాజ్యసభ విపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రభుత్వ విధానాలను, సభలో ప్రధానమంత్రి ప్రకటన చేయకపోవడాన్ని విమర్శించారు.
ఆపరేషన్ సిందూర్‌పై తప్పకుండా చర్చిస్తామని,సభలో ఎప్పుడేం చర్చించాలో ప్రభుత్వానికి బాగా తెలుసని రాజ్యసభ నాయకుడు, బీజేపీ పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఘాటుగా సమాధానమిచ్చారు. సభలో పరిస్థితి అదుపు తప్పడంతో పెద్దల సభను చైర్మన్ ధన్కడ్ వాయిదా వేశారు.