సినిమా

ఫిష్ వెంకట్‌కు మెగా సాయం!

Ram Charan: ప్రముఖ కామెడీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా, రామ్ చరణ్ సాయం అందించారు. ఈ హృదయపూర్వక సహాయం ఫిష్ వెంకట్ కుటుంబానికి ఆసరాగా నిలిచింది.

తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ విలన్‌గా గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. కిడ్నీ మార్పిడి కోసం సుమారు రూ. 50 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆయన కుటుంబం దాతల సాయం కోరింది. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్, తన తనయ క్లింకార కొణిదెల ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు. ఈ సాయంతో ఫిష్ వెంకట్ కుటుంబానికి ఆసరా లభించింది. సినీ పరిశ్రమ నుంచి మరికొందరు కూడా సహాయం చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button