తెలంగాణ
ఉప్పల్ ఫ్లై ఓవర్ పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి

యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్ హైవేపై దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లై ఓవర్ పనులు నత్తనడకన సాగుతుండటంతో హైదరాబాదీలు, జిల్లాలకు వెళ్లేవాళ్లు ప్రతినిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఆర్థిక వనరులు, ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. త్వరలో పనులు పూర్తి చేసి ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దసరాకు ప్లై ఓవర్‌పై వాహనాలు రయ్ రయ్ మంటూ తిరుగుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.