ఆంధ్ర ప్రదేశ్
Peddireddy: మోసం చేయడం చంద్రబాబు నైజం

Peddireddy: చిత్తూరు జిల్లా పుంగనూరులో సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మోసం చేయడం చంద్రబాబు నైజం అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలను మోసం చేయడం ఆయన నైజం అన్నారు.
ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో విద్యుత్ , చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. తల్లికి వందనం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, కేవలం 3 వేల కోట్ల రూపాయలే నిధులు మంజూరు చేశారన్నారు. సూపర్ సిక్స పథకం అమలు చేయలేదని మండిపడ్డారు.