శర్వానంద్‌తో తమిళ డైరెక్టర్ మరో లవ్‌స్టోరీ?

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, తమిళ దర్శకుడు సి. ప్రేమ్ కుమార్‌తో మరోసారి జతకడుతున్నారు. క్లాసిక్ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌లో శర్వా నటన కొత్త ఒరవడిని సృష్టించనుంది.
తమిళ చిత్రసీమలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సి. ప్రేమ్ కుమార్ మరోసారి టాలీవుడ్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. శర్వానంద్‌తో కలిసి ఓ హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీని తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. ఈ మూవీ కోసం శర్వా నటనా కోణాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా కథ రాసినట్లు సమాచారం. రెండు విభిన్న పాత్రలతో శర్వా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.
‘96’ సినిమాతో తమిళంలో బ్లాక్‌బస్టర్ అందుకున్న ప్రేమ్ కుమార్, తెలుగులో శర్వాతో ‘జాను’ రీమేక్ చేశారు. అయితే, ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం ‘96’ సీక్వెల్, సూర్యతో మరో ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్న ఆయన, త్వరలో ఈ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. శర్వానంద్‌కు ఈ సినిమా కీలకం కానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.