Chandrababu: రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

Chandrababu: అమరావతి సచివాలయంలో రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష చేపట్టారు. ప్రజల భూ సమస్యలు, పరిష్కారం కోసం ఏడాది కాలంలో తీసుకున్న చర్యలపై సమీక్షించారు. గత పాలకుల కారణంగా ప్రతి గ్రామంలో పెద్దఎత్తున భూ వివాదాలు, భూ సర్వే సమస్యలు తలెత్తాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ తీసుకుంటున్న చర్యలపై సీఎం అంత సంతృప్తిగా లేరని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి నుంచి భారీ స్థాయిలో మార్పులు జరిగితే తప్ప ఫలితాలు ఉండవనే చర్చ పైనా ఆయన దృష్టి సారించారు.
తహసీల్దార్ కార్యాలయాల్లో వేల సంఖ్యలో ప్రజల అర్జీలు పేరుకుపోవడంపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగులు, అధికారుల కొరత, పనిభారం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేసేందుకు విస్తృతంగా సాంకేతికత వాడకంపైనా దృష్టి సారించారు. ఏడాదిలో భూ సమస్యలు పరిష్కారం చేస్తానని చంద్రబాబు మహానాడులో ప్రకటించారు. రెవెన్యూ సమస్యలపై కీలక ఆదేశాలు, నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.