ఆంధ్ర ప్రదేశ్
నరసరావుపేటలో RMP వైద్యుడి నిర్వాకంతో చిన్నారి మృతి

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ డాక్టర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వాంతులు, విరేచనాలతో బాధపడిన చిన్నారి ఆయేషాను చికిత్స నిమిత్తం పార్ధు ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి ఆయేషాకి RMP డాక్టర్ పార్ధు ఇంజెక్షన్ ఇచ్చినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ ఇంజెక్షన్ చేసిన కొద్దిసేపటికే ఆయేషా స్పృహ కోల్పోయిందని కుటుంబసభ్యు లు ఆరోపిస్తున్నారు.
దీంతో నరసరావుపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. RMP డాక్టర్ పార్ధు నిర్లక్ష్యం వల్లే ఆయేషా చనిపోయిందని ఆరోపిస్తున్నారు. అటు న్యా యం కావాలంటూ RMP డాక్టర్ పార్ధు క్లీనిక్ వద్ద బాధిత తల్లిదండ్రులు, బంధువులు ధర్నాకు దిగారు.