తెలంగాణ
Eatala Rajendar: రేవంత్ ఢిల్లీలో మోదీని కలుస్తారు.. గల్లీలో విమర్శిస్తారు

Eatala Rajendar: ఏపీ కేంద్రం అండతో అనేక రంగాల్లో దూసుకు వెళ్తుంటే తెలంగాణ మాత్రం వెలవెలబోతుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గతంలో కేసీఆర్ మాదే ధనిక రాష్ట్రం మాకు ఎవరి సాయం అవసరం లేదన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి మోదీని కలుస్తారన్నారు. రేవంత్ ఢిల్లీలో మోడీని కలిసి గల్లీలో విమర్శిస్తారని ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డిది రెండు నాలుకల ధోరణి అని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలు చెప్పుకోవడానికి బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో సెల్ ఏర్పాటు చేశమన్నారు.