తెలంగాణ
Medchal: విషాదం.. గేటు మీద పడి ఏడేళ్ల బాలుడి మృతి

Medchal: మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ముందున్న గేటు వద్ద ఆడుకుంటున్న బాలుడిపై ప్రమాదవశాత్తు గేటు మీద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న అమ్మమ్మ, తాతల వద్దకు మెదక్ జిల్లా కుకునూరు మండలం వెల్దుర్తికి చెందిన ఆకాశ్ అనే ఏడేళ్ల బాలుడు బాలుడు వచ్చాడు.
ఈ క్రమంలో గురువారం గేటు వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు అది బాలుడిపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆకాశ్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



