అంతర్జాతీయం

Pakistan: పాక్‌లో అగమ్యగోచరంగా మారిన బాలల భద్రత

Pakistan: పాకిస్థాన్ ఈ పేరు వినగానే ప్రపంచంలో అరాచకాలు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దాయాది దేశంలో అసలు మానవత విలువలు ఉన్నాయా? రోజు రోజుకు భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌లో చిన్నారులు, బాలికలకే కాదు..బాలలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. చిన్నారులపై దాడులు, లైంగిక వేధింపులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. దాడులు, వేధింపులు, నేరాలతో అట్టుడుకుతున్న పాక్ లో భద్రత అగమ్యగోచరంగా తయారైంది.

పొరుగుదేశం పాకిస్థాన్ లో పరిస్థితులు రోజు రోజుకు మరింత దారుణంగా తయారవుతున్నాయి. దాడులు, వేధింపులు, నేరాలతో అట్టుడుకుతున్న పాక్‌లో భద్రత అగమ్యగోచరంగా మారిందని ఓ సర్వేలో వెల్లడైంది. మహిళలే కాకుండా చిన్నపిల్లలు, బాలలకు కూడా రక్షణ లేకుండా పోయిందని తెలిపింది.

ఇంటి బయటే కాకుండా ఇంటి లోపలా వారికి భద్రత కరవైందని పేర్కొంది. ఒక ఏడాదిలో పాకిస్థాన్‌లో 4వేల 213 చిన్నారులపై అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకు 11 మంది చిన్నారులు దోపిడీకి గురవుతున్నారు.

పాకిస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. చిన్నారులపై దాడులు, లైంగిక వేధింపులు గణనీయంగా పెరిగిపోతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా బాధితుల్లో ఎక్కువగా అబ్బాయిలే ఉండటం గమనార్హం. ఒక్క పంజాబ్‌ ప్రావిన్సులోనే ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో నమోదైన వేధింపుల కేసుల్లో 70శాతం మంది బాలురే ఉన్నట్లు తెలిపింది.

బాధితుల్లో అత్యధిక శాతం బాలురే ఉన్నట్లు అందులో వెల్లడైంది. ఉచిత మత విద్య, భోజనం కోసం ఇస్లామిక్ పాఠశాలల్లో చేరిన పేదరికంలో ఉన్న కుటుంబాల నుండి వచ్చిన పిల్లలు మౌల్వీ చేత లైంగిక వేధింపులకు గురై, తరువాత మౌనంగా ఉండమని బెదిరించబడిన దుస్థితిని ఎన్నో ఉన్నాయి.

పంజాబ్‌ ప్రావిన్సులో ఈ ఏడాది జనవరి-మే మధ్యకాలంలో చిన్నారులపై వేధింపులకు సంబంధించి 1,400 ఘటనలు నమోదు కాగా అందులో 965 బాలురే ఉన్నారని తెలిపింది. మిగతా 30శాతం బాలికలు ఉన్నారు. చిన్నారులపై లైంగిక దాడులకు అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయని పితృస్వామ్య, పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక అసమానతల కారణంగా చిన్నారులపై ఇటువంటి దాడులకు కారణమవుతున్నాయి

లైంగిక దోపిడీ, కిడ్నాప్, తప్పిపోయిన పిల్లలు, బాల్య వివాహాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదికను పొందుపరిచారు. నమోదైన మొత్తం కేసుల్లో 56 శాతం మంది బాలికలు కాగా, 47 శాతం మంది బాలురు ఉన్నారు. వీరందరూ లైంగిక దోపిడీకి గురవుతున్నారు. 6 నుంచి 15 ఏళ్లలోపు అమ్మాయిల కంటే అబ్బాయిల పైనే ఎక్కువగా వేధింపులు జరుగుతున్నాయి. అంతే కాకుండా 0-5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు సైతం లైంగిక వేధింపులు తప్పడం లేదని వెల్లడైంది.

పరిచయం ఉన్న పిల్లలపైనే లైంగిక వేధింపులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పంజాబ్‌ ప్రావిన్స్ లోనే అత్యధిక కేసులు 75శాతం నమోదయ్యాయి. సింధ్‌లో 13 శాతం, ఇస్లామాబాద్‌లో 7 శాతం, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 3 శాతం, బలూచిస్తాన్, జీబీలో 2 శాతం కేసులు నమోదయ్యాయి. లైంగిక దోపిడీ తర్వాత 61 హత్య కేసులు, 1,833 కిడ్నాప్ కేసులు, 330 పిల్లల అదృశ్యం కేసులు, 29 బాల్య వివాహాల కేసులు నమోదయ్యాయి.

మతపరమైన సెమినరీలు ,మతాధికారులు తమ దుర్మార్గపు లైంగిక కోరికల కోసం మత సంస్థలను ఉపయోగించుకుంటున్నారని ప్రజలు నిందిస్తున్నారు. లైంగిక వేధింపులకు సంబంధించిన పిల్లల వాదనలను నమ్మే అవకాశం చాలా తక్కువ అని తెలిసినందున కొంతమంది మతాధికారులు బలహీన పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మదర్సాల్లోని మతాధికారులు పిల్లలపై వేధింపులకు పాల్పడిన అనేక కేసులు జరుగుతాయని నిపుణులు అంటున్నారు.

పాక్‌లో బాలలపై జరుగుతన్న దురాగతాలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ ఎండగట్టింది. పాకిస్తాన్‌లో బాలలపై పెద్ద ఎత్తున అఘాయిత్యాలు, నేరాలు జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి పి. హరీశ్‌ ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్‌ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.

పాక్‌ ప్రోద్బలంతో పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రపంచం మర్చిపోలేదని అన్నారు. వీటన్నింటిని నుంచి ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడానికి పాక్‌ కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు.

పాకిస్తాన్ సరిహద్దుల్లో పిల్లలపై జరుగుతున్న అకృత్యాలే కాకుండా, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో దాని సైనిక కార్యకలాపాలకు కూడా ఉపయోగించుకుంటుంది. పాకిస్తాన్‌లో పాఠశాలలపై, ప్రధానంగా బాలికల పాఠశాలలపై, ఆరోగ్య కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయని, పాక్‌–అఫ్గానిస్తాన్‌ సరిహద్దులో ఆరాచకం రాజ్యమేలుతోందని అన్నారు.

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌ సైతం ఈ విషయం వెల్లడించినట్లు గుర్తుచేశారు. పాక్‌ ప్రభుత్వం ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, సొంత దేశాన్ని చక్కదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉగ్రవాదులను ఎగదోయడం మానుకోకపోతే పాకిస్తాన్‌ మరింత నష్టపోవడం ఖాయమని తేల్చిచెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button