ఆంధ్ర ప్రదేశ్
అమలాపురం వేదిక 3వ ప్రపంచ తెలుగు మహాసభలు

తెలుగు భాష, సాహిత్య సంస్కృతుల సమ్మేళనమే ప్రపంచ తెలుగు మహాసభల ఉద్దేశమన్నారు చైతన్య విద్యా సంస్థల ఛైర్మన్ చైతన్య రాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్యే ఆనందరావుతో కలిసి ఆవిష్కరించారు.
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 వరకు జరగనున్న ఈ సభలకు తొలి రోజు సీఎం చంద్రబాబు హాజరవుతారని ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నట్లు చెప్పారు చైతన్య. వివిధ రంగాలలో నిష్ణాతులైన 1600 మంది ప్రముఖులను సత్కరించనున్నట్లు వెల్లడించారు.



