Zohran Mamdani: ట్రంప్‌నకు షాక్.. న్యూయార్క్ నగర మేయర్‌గా జొహ్రాన్ మమ్దానీ

Zohran Mamdani: అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అగ్రరాజ్యం అమెరికాలో పలు పదవులకు జరిగిన ఎన్నికల్లో భారతతి సంతతికి చెందిన వ్యక్తులు, డెమోక్రాట్లు తమ హవా కొనసాగించారు. అమెరికాలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. న్యూయార్క్ నగర మేయర్‌గా డెమాక్రెటిక్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన జొహ్రాన్ మమ్దానీ ఎన్నికయ్యారు.
అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి షాకిచ్చాయి. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్ నగరమేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందిన జొహ్రాన్ మమ్‌దానీ ఎగరేసుకుపోయారు.
జొహ్రాన్ ఎన్నికైతే నిధులు నిలిపివేస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఖాతరు చేయని న్యూయార్క్ ప్రజలు మమ్దానీకే పట్టం కట్టారు. నగర మేయర్‌గా ఎన్నికైన తొలి ముస్లింగా, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా మమ్దానీ చరిత్ర సృష్టించారు.
కేవలం 34 ఏళ్ల వయసులోనే జొహ్రాన్ మమ్దానీని మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. గత వందేళ్లల్లో అత్యంత పిన్న వయస్కుడైన మేయర్‌గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. అమెరికా వ్యాప్తంగా ఆధిపత్య పోకడలు వేళ్లూనుకుంటున్న వేళ డెమాక్రెటిక్ పార్టీకి ఈ విజయం కొత్త ఊపునిచ్చింది.



