సినిమా
Bhairavam: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన భైరవం!

Bhairavam: తెలుగు సినిమా అభిమానులకు శుభవార్త! బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన భైరవం ఓటీటీలోకి రాబోతోంది.
టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన భైరవం సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తమిళ హిట్ చిత్రం గరుడన్ రీమేక్‌గా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, మే 30న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది.
ఈ యాక్షన్ డ్రామా ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే భావోద్వేగ కథాంశంతో ఆకట్టుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 సొంతం చేసుకుంది. జూలై 18 నుంచి తెలుగుతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ కానుంది.