ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila: చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి

YS Sharmila: చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ మోపుతూ కేంద్రం నడ్డివిరుస్తోందని, అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమందికి మాత్రమే ఇస్తుందని షర్మిల విమర్శించారు. నిండైన భారతీయతకు, అస్తిత్వానికి అసలైన గుర్తింపునిచ్చే నేతన్న సంక్షేమానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చేనేత దినోత్సవం సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు.



