ఆంధ్ర ప్రదేశ్
Jagan: నేడు విశాఖలో వైఎస్ జగన్ పర్యటన

Jagan: నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి మాకవరపాలెంకు రోడ్డు మార్గాన వెళ్లనున్నారు. మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. KGHలో కురుపాం గిరిజన బాలికలను పరామర్శించనున్నారు.
జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు పోలీసులు. జనసమీకరణకు అనుమతి లేదన్నారు. జగన్ పర్యటన సందర్భంగా ఊరేగింపులు, సమావేశాలపై నిషేధం విధించారు. షరతులు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దుచేస్తామని హెచ్చరించారు.



