Nag Ashwin: ‘కల్కి 2’ పై నాగ్ అశ్విన్ సెటైరికల్ కామెంట్స్

Nag Ashwin: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడి’ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ అద్భుతమైన గ్రాఫిక్స్, ప్రభాస్ భైరవ పాత్రతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సీక్వెల్ ‘కల్కి 2’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, నాగ్ అశ్విన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘కల్కి 2898 ఏడి’ సినిమా రిలీజ్ తర్వాత సీక్వెల్‌పై చిత్ర యూనిట్ ప్రకటన చేసినప్పటికీ, ‘కల్కి 2’ ఆలస్యం కావొచ్చని నాగ్ అశ్విన్ సూచనప్రాయంగా తెలిపారు. గతంలో సీక్వెల్ రిలీజ్‌కు 3-4 గ్రహాలు అనుకూలించాలని చెప్పిన ఆయన, ఇప్పుడు సెటైరికల్‌గా 7-8 గ్రహాలు కలవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభాస్ ప్రస్తుతం కమిట్ అయిన ఇతర చిత్రాలను పూర్తి చేయాల్సి ఉండటమే ఈ ఆలస్యానికి కారణమని సమాచారం. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ‘కల్కి 2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.