ఆంధ్ర ప్రదేశ్
బాలుడికి వైఎస్ జగన్ అక్షరాభ్యాసం

తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను శ్రీకాకులం జిల్లా దండు గోపాలపురం వైసీపీ కార్యకర్త లెనిన్ వివేక్ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కుమారుడికి జగన్ చేత అక్షరాభ్యాసం చేయించారు వివేక్ దంపతులు. తమ కుమారుడికి వైఎస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరగినందుకు సంతోషం వ్యక్తం చేసిన వివేక్ కుటుంబం గతంలో కూడా తమ కుమార్తెకు జగనే అన్నప్రాసన చేశారని గుర్తు చేసుకున్నారు.



