ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: తుపానుపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్

YS Jagan: మొంథా తుపాను నేపథ్యంలో పార్టీ నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ సీఎం జగన్ అన్నారు.
పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుపాను దెబ్బపడిందన్నారు. దీనివల్ల దిగుబడులు బాగా దెబ్బతింటాయన్నారు. నేలకొరిగిన పంట తిరిగి నిలబడ్డం కష్టమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలబడాలని జగన్ పిలుపునిచ్చారు.



