YS Jagan: వైసీపీని మరింత బలోపేతం చేసేలా జగన్ ఫోకస్

YS Jagan: వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ పునర్నిర్మాణం, స్థానిక నాయకత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు, కొత్త వ్యూహాలతో పార్టీని పునర్మించాలని వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నూతన వ్యూహాలతో పార్టీని పునర్నిర్మించడానికి కీలక మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారట.
దీంతో వైసీపీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పట్టు బిగించేలా జగన్ పార్టీలో పలు మార్పులు చేర్పులు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉద్యమాల పేరుతో పోరాటాలు మొదలుపెట్టగా క్యాడర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఇంఛార్జ్ ల మార్పు అనివార్యంగా భావిస్తోంది. ముందుగా ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న తీరుగా సొంత జిల్లా నుంచే ఆ ప్రక్రియను మొదలుపెట్టనున్నారట వైసీపీ అధినేత.
జగన్ అంటే ఓ ఆకర్షణ అదే జగన్ ఎక్కడుంటే అక్కడ జనసంద్రం అధికారంలో ఉన్నా లేకపోయినా చరిష్మా తగ్గని అధినేత జగన్ అంటే ఎవరైనా నమ్మక తప్పదు ఎందుకంటే జగన్ ఒక జనప్రభంజనం పార్టీ పెట్టిన దశాబ్ద కాలానికి పైబడిన ప్రస్థానం తొలినాళ్లలో గెలుపోటములు ఆటుపోట్లు ఎన్నెన్నో అలాంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో 2024 ఎన్నికలు చేదు జ్ఞాపకాలు అనేకంటే చేదు నిజాలను నిగ్గు తేల్చాయని చెప్పుకోవచ్చు అలవికాని ఓటమి భారం మోసుకున్న జగన్ ఇక నుంచి పట్టువిడుపులకు అవకాశం ఇవ్వబోతున్నట్టు సమాచారం పార్టీ పటిష్టత కోసం మూస విధానాలకు స్వస్తి పలకబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీలో పలు చేర్పులు మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.
అయితే ఈ విధానం జగన్ తన సొంత జిల్లా కడప నుంచే శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని సమాచారం ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలోని మొత్తం పది నియోజకవర్గాల్లో బలహీనపడిన ప్రాంతాలను ఇప్పటికే గుర్తించించినట్టుగా తెలుస్తోంది. ఇంచార్జ్ ల వ్యవహారాన్ని అనుకున్న రీతిలో మార్పు చేసేందుకు రేపో మాపో సంకల్పించనున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గం నుంచి ఓటమి పాలైన శెట్టిపల్లి రఘురామిరెడ్డిని వయసు రీత్యా తప్పించాలని భావిస్తున్నారట ఇప్పటికే అక్కడి నుంచి ఎన్నడూ లేని విధంగా ఓ బీసీ నాయకుడు తొలిసారిగా టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు.
మైదుకూరు ఎన్నికల చరిత్రలో రెడ్డి సామాజిక వర్గం తప్పితే మరొకరు ఎమ్మెల్యేగా ఎన్నికైన దాఖలాలు లేవు అలాగని రాజకీయ పార్టీలు ఆ సామాజిక వర్గానికి తప్పితే మరొకరికి టిక్కెట్లు కేటాయించింది కూడా లేదని చెప్పొచ్చు 2024 ఎన్నికలకు సీన్ మారి పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సరిగ్గా అదే ఫార్ములాను జగన్ అవలంభించనున్నట్లు తెలుస్తోంది.
అధికారాన్ని కోల్పోయి ఎమ్మెల్యేలంతా మాజీలైపోయిన సందర్భంలో సొంత జిల్లా కడపకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు బాగా దగ్గరయ్యారు. ప్రొద్దుటూరు నుంచి మునిసిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైన రమేష్ యాదవ్ ఒకానొక సమయాన ఏకంగా ఎమ్మెల్సీ గా నామినేట్ అయిపోయారు. అదే అదనుగా జగన్ కు బాగా దగ్గరయ్యారు కూడా కాగా మైదుకూరు నియోజకవర్గం బలిజలతో పాటు యాదవ సామాజికవర్గం కూడా అధికంగానే ఉంటుంది.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో యాదవ్ కు యాదవే పోటీ అన్నట్టుగా పుట్టా సుధాకర్ కు పోటీగా రమేష్ యాదవ్ ను రంగంలోకి దించనున్నట్లు సమాచారం ఈ సందర్భంలోనే ఇక్కడి ప్రస్తుత వైసీపీ ఇంచార్జ్ రఘురామిరెడ్డి ప్లేస్ లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు ఆ బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలు స్పష్టమవుతున్నాయని తెలుస్తోంది.
ఇక బద్వేలు నుంచి వైసీపీ ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకున్నా అక్కడ అదే పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్న విషయం అధిష్టానానికి తెలియనిది కాదు. ఎస్సీ నియోజకవర్గంగా ఉంటున్న బద్వేలు నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే డాక్టర్ సుధ ఉండగా ఇంచార్జ్ బాధ్యతలు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నిర్వహిస్తున్నారు. అదనపు సమన్వయ కర్తగా విశ్వనాధ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
అయితే వచ్చే ఎన్నికల నాటికి యువరక్తానికి ఆ పార్టీ పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీలో కీలకమైన నేతగా ఎదిగిన విశ్వనాథరెడ్డి ఇప్పటికైతే పార్టీనుంచి సరైన పదవులు ఆశించిన దాఖలాలు లేవు అయితే ఇప్పటి వరకు ఒకసారి ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్సీ ఛాన్సులు అదే సందర్భంలో ఇంచార్జ్ పదవులను సైతం గోవిందరెడ్డి దక్కించుకున్నారు.
అయితే ఈసారికి యువకుడైన విశ్వనాథరెడ్డి కి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించి పార్టీని మరింతగా పటిష్టం చేసుకునేందుకు జగన్ తలుస్తున్నారట ఆ విధంగా నైనా తన తండ్రి వైఎస్ జమానా నుంచి తన కుటుంబానికి విధేయతగా ఉంటూ వస్తున్న విశ్వనాథరెడ్డి కి న్యాయం జరుగుతుందని ఆయన అనుచరులు విశ్వసిస్తున్నారు. అంతే కాకుండా మైదుకూరు పాలసీ ప్రకారం బద్వేలు నేత గోవిందరెడ్డి సైతం వయోభారంతో ఉన్నారట అలాంటి కారణాలు మారుతున్న రాజకీయ సమీకరణాలు ఫలితంగా యువ రక్తానికే జగన్ అత్యధిక ప్రాధాన్యమిచ్చే అవకాశాలు లేకపోలేదు.
అదేవిధంగా సొంత నియోజకవర్గమైన పులివెందులలో సైతం ఇంచార్జ్ మార్పునకు జగన్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం గడచిన ఎన్నికల ముందు నుంచి జరుగుతున్న వ్యవహారాలు నిన్నమొన్నటి జడ్పిటీసీ ఉప ఎన్నికల చేదు అనుభవాలు దృష్టిలో ఉంచుకొని అక్కడి బాధ్యతలను మరొకరికి అప్పగించే చాన్స్ ఉన్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం పులివెందులకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే అక్కడ నెలకొన్న ప్రస్తుత రాజకీయ నేపద్యాన్ని దృష్టిలో పెట్టుకొని చవ్వా దుష్యంత్ రెడ్డి కి పులివెందుల పట్టం కట్టే అవకాశాలున్నట్టు సమాచారం కాగా దుష్యంత్ రెడ్డి గడచిన ఎన్నికల్లో కమలాపురం టిక్కెట్టు ఆశించారు. అదే విధంగా జమ్మలమడుగు ఎన్నికల ఇంచార్జ్ గా వ్యవహరించి ప్రచారం సైతం చేశారు.
మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది ఈ క్రమంలో వైసీసీ ఓటమి పాలై అంతే సమయం అయింది. ఈ క్రమంలో 2029 ఎన్నికల నాటికి గెలుపే లక్ష్యంగా పార్టీని పటిష్టం చేసుకునేందుకు జగన్ గట్టి వ్యూహాన్నే అవలంభిస్తున్నట్టు తెలుస్తోంది. తొలుత సొంతిల్లు చక్కబెట్టుకొని ఆ తర్వాత రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు ఇదే పాలసీని వర్తింపజేయనున్నట్టు పక్కా సమాచారం ఏది ఏమైనా సీనియర్లు అనబడే మూస విధానపరమైన నేతలకు చెక్ పెట్టి యువరక్తానికి ప్రాధాన్యమిచ్చేట్లు జగన్ అడుగులు వడివడిగా పడుతున్నాయట.



