ఆంధ్ర ప్రదేశ్
బాలకృష్ణపై జగన్ హాట్ కామెంట్స్

YS Jagan: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైరయ్యారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏమిటి..? ఆయన మాట్లాడింది ఏమిటి..? పనీపాట లేని సంభాషణ చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బాలయ్య మాటలను బట్టి.. ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందనన్నారు. అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్‌కు బుద్ది లేదన్నారు. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుతించారని ప్రశ్నించారు.



