తెలంగాణ
హరీష్ రావు ఇంట విషాదం.. వైఎస్ జగన్ సంతాపం

Harish Rao Father Death: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల వైసీపీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు జగన్. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావుగారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
సత్యనారాయణ రావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఇకపోతే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో హైదరాబాద్‌లోని క్రిన్స్ విల్లాస్‌లో సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. బీఆర్ఎస్ నేతలు, సహా ఇతర పార్టీ నేతలు, ప్రముఖలు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు.



