YS Jagan: కూటమి అరాచకాలు డిజిటల్ బుక్‌లో నమోదు

YS Jagan: రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచకాలు సృష్టిస్తున్న టీడీపీ కూటమి నేతలకు తాము అధికారంలోకి వచ్చాక డిజిటల్ బుక్‌తో చట్టం ముందు నిలబెడుతామని వైసీపీ అధినేత జగన్ హెచ్చరించారు. వైసీపీ నేతలపై అన్యాయంగా విరుచుకుపడుతున్నవారిని వచ్చే ఐదేళ్ల తర్వాత సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి చట్టపరంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలు, పార్టీ కార్యకర్తలు డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేయవచ్చని జగన్ చెప్పారు.
చంద్రబాబు సర్కార్ అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను అధ:పాతాళానికి నెడుతోందని జగన్ విమర్శించారు. అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న చంద్రబాబు సర్కార్ మెడికల్ కాలేజీల కోసం ఐదు వేల కోట్లు పెట్టలేరా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ తప్పిదాలపై పోరాడాలని వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ రెడ్డి పార్టీ లీడర్లకు, కేడర్‌కు పిలుపునిచ్చారు.



