తెలంగాణ
Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ ప్రజలు రేవంత్ పాలనను ఆదరించారు

Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ ప్రజలు రేవంత్ పాలనను ఆదరించారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ అన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా వస్తుందన్నారు. ఏ ఎన్నిక అయినా గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనన్నారు.
ప్రజలకు బీఆర్ఎస్‌కు ఎప్పుడో సెలవు ప్రకటించారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక బీహార్ ఎన్నికలపై పూర్తి ఫలితాలు వచ్చాకే స్పందిస్తామన్నారు కాంగ్రెస్ సంక్షేమ పథకాల సర్టిఫికెట్ అన్నారు.



