సినిమా

షారుఖ్ పై యూట్యూబర్ ఫైర్!

బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలపై యూట్యూబర్ ధృవ్ రాఠీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక బాధ్యతను విస్మరిస్తూ ప్రకటనల్లో నటిస్తున్నారని ఆరోపించారు. షారుఖ్ ఖాన్‌ను ఉద్దేశించి సూటి ప్రశ్నలు వేశారు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

యూట్యూబర్ ధృవ్ రాఠీ తాజా వీడియో సెలబ్రిటీల సామాజిక బాధ్యతపై తీవ్ర చర్చను రేకెత్తించింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌ను టార్గెట్ చేస్తూ, హానికరమైన పాన్ మసాలా ప్రకటనల్లో ఎందుకు నటిస్తున్నారని ప్రశ్నించారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం, షారుఖ్ ఆస్తుల విలువ 1.4 బిలియన్ డాలర్లు, అంటే రూ. 12,400 కోట్లు. ఇంత సంపద ఉన్నా, ఎందుకు ఇలాంటి ప్రమోషన్లు చేస్తున్నారని రాఠీ నిలదీశారు.

టామ్ క్రూజ్, డ్వేన్ జాన్సన్‌లను కూడా ఆస్తుల్లో అధిగమించిన షారుఖ్, విలాసవంత జీవనం గడిపినా రూ. 400-500 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తారని విశ్లేషించారు. ఇంత ధనవంతుడైన నటుడు హానికర ఉత్పత్తులను ప్రచారం చేయడం సమాజంపై చెడు ప్రభావం చూపుతుందని రాఠీ విమర్శించారు. సెలబ్రిటీలు డబ్బు కోసం సమాజ వ్యతిరేక చర్యలకు పాల్పడటం ఆలోచింపజేస్తుందని రాఠీ పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button