తెలంగాణ
హైదరాబాద్ జగద్గిరిగుట్ట లో యువతి హత్య

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. బంగారం కోసమే దూరపు బంధువు శివమాధవరెడ్డి గొంతు నులిమి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నిహారిక అనే యువతి ప్రమాదవశాత్తు బాత్ రూమ్ లో జారిపడి మరణించిందని నిందితుడు నమ్మించాడు.
కానీ ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో భర్త ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న నిందితుడు బెట్టింగులకు అలవాటు పడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని నిర్ధారించారు.



