AP Legislative Council : శాసనమండలిలో వైసీపీ, టీడీపీ మాటల యుద్ధం

AP Legislative Council: ఏపీ శాసన మండలి సమావేశాల్లో వైసీపీ, టీడీపీల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. మెడికల్ కళాశాలల పీపీపీ అంశంపై చర్చ జరిగేలా చూడాలని చైర్మన్ పై వైసీపీ ఒత్తిడి తీసుకు వస్తుంది. తక్షణమే ఈ అంశంపై చర్చించాలని మండలి చైర్మన్‌కు వాయిదా తీర్మానం అందజేసింది. అయితే ఈ వాయిదా తీర్మాన్ని చైర్మన్ తిరస్కరించడంతో ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో సభను వాయిదా వేసిన చైర్మన్ మోషేన్ రాజు మరోసారి బీఏసీ సమావేశాన్ని నిర్వహించారు. అయితే బుదవారం మెడికల్ కళాశాలలపై చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించటంతో సభ కొనసాగింది.
అంతకు ముందు నల్ల కండువాలతో శాసనమండలికి హాజరైన వైసీపీ ఎమ్మెల్సీలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ బిల్లు కారణంగా కార్మికులు నష్టపోతారని.. మహిళలకు రక్షణ కరువవుతుందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది వైసీపీ బిల్లు కారణంగా కార్మికులపై పనిభారం పెరుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేయటంతో బిల్లును మండలిలో ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు మంత్రి వాసంశెట్టి సుభాష్.



