ఆంధ్ర ప్రదేశ్
కుప్పంలో వైసీపీ వర్సెస్ జనసేన వార్

చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లు వార్ జరుగుతుంది. ఆరు నెలలుగా జనసేన కార్యకర్తకు వైసీపీ రౌడీ తాండవ కృష్ణ బెదిరింపులకు పాల్పడ్డాడు. పలుమార్లు హత్యాయత్నం చేయగా తప్పించుకున్నారు జనసేన నేత మణికంఠ. ఈ క్రమంలోనే అదునుచూసి మణికంఠపై హత్యాయత్నం చేయగా తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.