తెలంగాణ
ఖమ్మంలో కేటీఆర్ ర్యాలీలో వైసీపీ జెండాలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అనూహ్యంగా ఏపీ మాజీ సీఎం జగన్ ఫొటోలు, వైసీపీ జెండాలు దర్శనమిచ్చాయి.
వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా ర్యాలీలో పాల్గొని జై జగన్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.



