ఆంధ్ర ప్రదేశ్
Pithapuram: మహిళపై కత్తులతో దుండగుల దాడి

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ మహిళపై కత్తితో దుండగులు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆసుపత్రి నుండి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న నర్సుపై విచక్షణారహితంగా దాడి చేశారు ఆగంతకులు.
దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. ఆగంతకుల దాడిలో తీవ్రంగా గాయపడిన సునీతను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



