తెలంగాణ

Nirmal: పోలీస్ స్టేషన్ ముందు మహిళ ధర్నా

Nirmal: తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసింది. ఆదిలాబాద్ భాగ్యనగర్ కాలనీకి చెందిన మణి పట్టణ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. గతకొంతకాలంగా భర్తతో గొడవలు జరుగుతుండటంతో పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆయితే తన భర్త అంజయ్య కూతురు కీర్తనను తీసుకొని వెళ్లిపోయాడంటూ కుటుంబసభ్యులతో కలిసి ఆందోళన చేపట్టింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button