ఆంధ్ర ప్రదేశ్
ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. డ్రైవర్ సీటుకే ఎసరు పెట్టిన మహిళ

AP: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఉమ్మడి కడప జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు వింత ఘటన ఎదురైంది. ఇప్పుడు ఆ సీన్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. బద్వేలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కడపకు వైపు వెళ్తుండగా బాకరాపేట వద్ద ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
బస్సు పూర్తిగా మహిళాలతో నిండిపోయింది. బస్సులో కాలు పెట్టేందుకు కూడా చోటు లేదు. దీంతో ఓ మహిళ బస్సుకు అడ్డంగా నిలుచుంది. బస్సులో చోటు లేదని డ్రైవర్ ఎంత మొరపెట్టుకున్నా సదరు మహిళ మాత్రం వినలేదు. చివరికి ఆ మహిళ డ్రైవర్‌ను దించి బస్సు ఎక్కింది. ఇప్పుడు ఈ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.



