Aadi Srinivas: గల్ఫ్‌కి వెళ్తావా..? పంపిస్తామంటూ MLA ఆది శ్రీనివాస్‌కి ఫోన్ కాల్

Aadi Srinivas: గల్ఫ్‌కి వెళ్తావా..? పంపిస్తామంటూ MLA ఆది శ్రీనివాస్‌కి ఫోన్ కాల్ రావడం కలకలం రేగింది. ఏకంగా MLA ఆది శ్రీనివాస్‌తో బేరాలు జరగడంతో ఎమ్మెల్యే షాక్‌కి గురయ్యారు. తాను MLA అని చెప్పినా కాల్ చేసిన యువతి పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఒకింత అసహనానికి గురయ్యాడు.
దీంతో ఫోన్ కాల్‌పై ఆరా తీయాలని పోలీసులకు MLA ఫిర్యాదు చే శారు. ఎమ్మెల్యే కంప్లయింట్‌తో రంగంలోకి దిగిన పోలీసులు చర్యలు చేపట్టారు. తీగ లాగితే అక్రమ దందా బయటపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
లక్ష్మీ గల్ఫ్ ట్రావెల్స్ పేరుతో జగిత్యాల కేంద్రంగా ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు నవీన్. ఓ యువతికి ఉద్యోగం కల్పించి ఆమెతో యువతకు ఫోన్లు చేయిస్తున్నాడు. దుబాయ్, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో ఆఫర్స్ అంటూ పలువురికి యువతి రోజూ ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
గల్ఫ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నవీన్ తోపాటు యువతి పలువుర్ని ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వాహకుడు నవీన్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.