తెలంగాణ
Hyderabad: కుక్కర్‌తో తలపై కొట్టి .. కూకట్‌పల్లిలో మహిళ హత్య

హైదరాబాద్ కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది. రేణు అగర్వాల్‌ను పనిమనుషులు హర్ష్, రోషన్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఉన్న డబ్బు, నగలపై కన్నేసిన వారిద్దరూ ప్లాన్ ప్రకారం రేణును చంపి డబ్బు, నగలతో పరారయ్యారు. ప్రెషర్ కుక్కర్‌తో రేణు తల మీద మోది, కత్తితో గొంతుకోసి హత్య చేశారు. హత్య అనంతరం రేణు అగర్వాల్ స్కూటీ పైనే పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.



