తెలంగాణ
Revanth Reddy: అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం

Revanth Reddy: భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్ కుల మతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రచించారని, ప్రతీ ఒక్కరు ఆయన చేసిన సేవలను స్మరిం చుకోవాలన్నారు సీఎం రేవంత్. ఓటు అనే వజ్రాయుధాన్ని రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ ప్రజలకందించారని సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు.



